Skip to content

Starlings Books

Country/region

  • Canada CAD $
  • United States USD $
Log in Cart

Item added to your cart

View cart
  • Pre-order: ఏడు చేపల కథ (The Seven Fish) – A Bilingual Telugu-English Picture Book for Children

    Pre-order: ఏడు చేపల కథ (The Seven Fish) – A Bilingual Telugu-English Picture Book for Children

    Pre-order: ఏడు చేపల కథ (The Seven Fish) – A Bilingual Telugu-English Picture Book for Children

    Regular price From $13.99 USD
    Regular price Sale price From $13.99 USD
    Unit price /  per 

చిరకాలం చెదరని క్షణాల కోసం..

Children's books for timeless moments with family..

నమస్కారం!

నేను నా కొడుకు కి చిన్నప్పటి నుంచి చెప్పుకున్న ఏడు చేపల కథ ఎవరో ఒకరు ప్రచురించే ఉంటారు అన్న గట్టి నమ్మకం తో వెతకని website లేదు, మా నాన్నగారు హైదరాబాద్ లో తిరగని షాపూ లేదు. ఈ కథ ఐతే దొరకలేదు కానీ, దొరికిన వేరే కథల పుస్తకాలు నేటి తరం పిల్లలకి సరిపోయేలా లేవు. ఇంకొక వైపు వారి ధ్యాస అంతా గొప్ప format లు, చక్కని color scheme లు వాడుతూ ఉన్న ఇంగ్లీష్ పుస్తకాల మీద ఉంది. అందులో పిల్లల తప్పు లేదు.

కాబట్టి ఇంక తప్పదని నేనే ఈ కథ ని ప్రచురించడానికి పూనుకున్నాను. August లో, వినాయక చవితి ముందు ఈ పుస్తకం విడుదల అవుతుంది. 

మీరు ఈ కార్యానికి ఎలా అయినా సహాయపడగలరా?

ఈ పుస్తకం చదివిన ఒక్క చిన్నారి అయినా, రేపు తెలుగు అక్షరం కనిపించినప్పుడు ఏలియన్ లిపిని చూసినట్టు భయపడి పారిపోకుండా, చనువు తో ఇంకొక సారి ఆ అక్షరాల, పదాలు, వాటి లో ఉన్న భావాల వైపు తిరిగి చూసినా. లేకపోతే, తన లాగా కనిపించి, తన కుటుంబ సభ్యుల లాగా మాట్లాడేవారి లో కూడా గొప్ప కథలు, చరిత్రలు, కళలు ఉన్నాయి అనే విషయం వారి వ్యక్తిత్వం లో చిన్న చోటు చేసుకున్నా. అలా కాక మూలలు తెలుసుకోడానికి ఉన్న మాధ్యమం మాతృభాష, వారి గమనాన్ని గమ్యాన్ని తెలుసుకునేందుకు దోహద పడినా, మేము పడే ఈ శ్రమ కి ఫలితం దక్కినట్టే.

ఈ పుస్తకం అందరి కోసం కాకపోవచ్చు. కానీ మీకు తెలిసిన చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల్లో, ఇలా భాష, సంస్కృతి, పిల్లల మానసిక అభివృద్ధి, వారి గుర్తింపు గురించి పరితపించే కుటుంబ సభ్యులు ఒక్కరైనా ఉంటారు అని మా గట్టి నమ్మకం. వారికి ఈ సందేశాన్ని అందించడం లో మీరు ఎలాంటి సహాయం చేసినా, మా మనఃపూర్వక ధన్యవాదాలు!

I thought someone must have published the story of The Seven Fish that I've been telling my son since he was little. Despite searching online and my father scouring Hyderabad's shops, we couldn't find the book. Other children's books we found don't resonate with today's kids, who are drawn to visually impressive English books – and who can blame them?

So, I decided to publish it myself, aiming for an August release before Vinayaka Chavithi.

Can you please help me with this endeavor?

If even one child who reads this book stops seeing Telugu script as alien and instead views it with familiarity, exploring the words and their meaning, or if they grasp that their own community holds rich stories, history, and art, and this shapes their identity in some small way—if our mother tongue, the path to their roots, even subtly helps them find their way—then our efforts will be successful.

I strongly believe you know families with young children who deeply value language, culture, their children's development, and identity. Any help in sharing this message with them would be deeply appreciated.

  • Facebook
  • Instagram

Country/region

  • Canada CAD $
  • United States USD $
Payment methods
  • American Express
  • Apple Pay
  • Diners Club
  • Discover
  • Google Pay
  • Mastercard
  • Shop Pay
  • Visa
© 2025, Starlings Books Powered by Shopify
  • Privacy policy
  • Choosing a selection results in a full page refresh.
  • Opens in a new window.